‘సోలార్’ గ్రామాల్లో
నేటి నుంచి సర్వే
నేలకొండపల్లి/రఘునాథపాలెం: నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, మండల కేంద్రమైన రఘునాథపాలెంను సంపూర్ణ సోలార్ విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసినట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సురేందర్ తెలిపారు. ఆయా గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని గృహ, సర్వీసులకు ఉచితంగా సోలార్ ప్లాంట్లు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం బుధవారం నుంచి సర్వేకు వచ్చే బృందాలకు కావాల్సిన సమాచారం, పత్రాలు అందించాలని కోరారు. కాగా, మధిర నియోజకవర్గం సిరిపురంలో ఇప్పటికే సర్వే పూర్తికాగా వైరాలోని శ్రీరామగిరిలోనూ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వాడుకుంటూ మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. ఈసమావేశాల్లో డీఈఈ చింతమళ్ల నాగేశ్వరరావు, ఉద్యోగులు శ్రీధర్, కోక్యానాయక్, కె.రామారావుతో పాటు ఈవూరి శ్రీనివాసరెడ్డి, తాతా రఘురాం పాల్గొన్నారు.
నేటినుంచి రాష్ట్రస్థాయి
క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా సంఘం, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన అండర్–17 విభాగంలో బాలికల క్రికెట్ టోర్నీకి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మొదలయ్యే పోటీలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు పిచ్‌లు, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో అదనంగా మరో పిచ్‌లు సిద్ధం చేశా రు. లీగ్ పద్ధతిలో 18 మ్యాచ్‌లు జరుగుతాయని.. ఆతర్వాత సెమీస్, ఫైనల్స్ ఉంటాయని జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి కె.నర్సింహమూర్తి తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలకు రాష్ట్రంలోని పాత తొమ్మిది జిల్లాల నుంచి క్రికెటర్లు హాజరవుతారని వెల్లడించారు. ఆయా జిల్లాల నుంచి 144 మంది క్రికెటర్లు, 20మంది మేనేజర్లు, కోచ్‌లు హాజరుకానుండగా నిర్వహణ బాధ్యతల్లో 20 మంది పీడీ, పీఈటీలు పాలుపంచుకుంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment