ప్రజాస్వామిక గొంతులను నొక్కేసే ప్రయత్నం..
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాస్వామిక గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తుందని, ప్రశ్నించే వారిని జైళ్లకు పంపుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజలు, నిరుద్యోగులను నమ్మించి గెలిచిన కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తోందన్నారు. ఇదేసమయాన మంత్రుల బంధువులే పాలన చేస్తున్నట్లుగా ఉందని, కమీషన్లు వచ్చే ప్రాజెక్టులను పూర్తి చేస్తూ రైతులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఇక ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్‌రావుపై కేసులు పెట్టడం, ప్రజల్లోకి వెళ్తుంటే హౌస్ అరెస్ట్ చేయడం పరిపాటిగా మారిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి, ఇంటింటి సర్వే చేశాక పథకాల అమలుకు మళ్లీ గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని సూచించారు. త్వరలోనే గ్రామాల్లో రుణమాఫీపై సర్వే చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు గుండాల కృష్ణ, శీలంశెట్టి వీరభద్రం, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు,
ఎమ్మెల్సీ తాత మధు
Comments
Please login to add a commentAdd a comment