![విద్యార్థితో చదివిస్తున్న అదనపు కలెక్టర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/3/02asb326-340137_mr.jpg.webp?itok=FKUHEJ8U)
విద్యార్థితో చదివిస్తున్న అదనపు కలెక్టర్
తిర్యాణి(ఆసిఫాబాద్): ప్రతి విద్యార్థి లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. తిర్యాణి మండలం గడలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సందర్శించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియో గం చే సుకోవాలని సూచించారు. గ్రామ సమస్యల ను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మడావి గుణవంత్‌రావు, ఉప సర్పంచ్ సోయం కట్టి తదితరులు ఉన్నా రు.
అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
Comments
Please login to add a commentAdd a comment