![సింగరేణి డైరెక్టర్‌గా సూర్యనారాయణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mcl127-340088_mr-1739214754-0.jpg.webp?itok=tSEM7DdX)
సింగరేణి డైరెక్టర్‌గా సూర్యనారాయణ
శ్రీరాంపూర్: సింగరేణి నూతన డైరెక్టర్‌గా శ్రీరాంపూర్ జీఎం ఎల్వీ సూర్యనారాయణ ఎంపికయ్యా రు. ఇటీవల కంపెనీలో ఖాళీ ఉన్న రెండు డైరెక్టర్ స్థానాలకు యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించింది. 10మంది జీఎంలను ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. సీనియారిటీ, సామర్థ్యం ఆధారంగా ఇద్దరు జీఎంలకు పదోన్నతులు కల్పించి డైరెక్టర్లుగా కంపెనీ నియమించింది. ఇందులో శ్రీరాంపూర్ జీఎం ఎల్వీ సూర్యనారాయణ, అడ్రియాల జీఎం కొప్పుల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇంటర్వ్యూల ఫలితాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వీరిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్వీ సూర్యనారాయణ డైరెక్టర్(ఆపరేష న్స్)గా, కొప్పుల వెంకటేశ్వర్లు డైరెక్టర్(ప్రాజెక్టు, ప్లానింగ్)గా వ్యవహరిస్తారు. ఏరియా జీఎం డైరెక్టర్‌గా ఎంపిక కావడంపై అధికారులు, యూని యన్ నాయకులు అభినందించారు. నూతనంగా ఎంపికై న ఇద్దరు డైరెక్టర్లను రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్‌ప్రసాద్ అభినందించారు. హైదరాబాద్‌లోని సింగరేణి సింగరేణి భవన్‌లో వారిద్దరిని సన్మానించారు. డైరెక్టర్లుగా రాణించి కంపెనీ ని మరింత అభివృద్ధిపర్చాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment