హెచ్‌ఎంలు చొరవ తీసుకుంటే ఉత్తమ ఫలితాలు
ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌పీఎల్ సక్రమంగా అమలు చేసేలా ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఈడీ కళాశాలలో సోమవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్‌జేడీ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాను ముందుంచాలని సూచించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ప్రతిరోజూ స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ, మార్కుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. మండల విద్యాధికారులు ప్రతిరోజూ ఐదు పాఠశాలలను సందర్శించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో గమానియ ల్, పరీక్ష నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, కోఆర్డినేటర్లు మధుకర్, అలీ, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment