పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇటీవల ప్రభుత్వం పెంచిన మధ్యాహ్న భోజన చార్జీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎండీఎం కార్మికులు సోమవారం జిల్లా కేంద్రంలో డీఈవో గమానియల్‌కు వినతిపత్రం అందించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ పెంచిన చార్జీలు డిసెంబ ర్ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అందించే స్నాక్స్ కోసం ఒక్కొక్కరికి రూ.20 అందించాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు భీంబాయి, రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment