![ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10asb56-340109_mr-1739214754-0.jpg.webp?itok=9zvGZTrY)
ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(రెవె న్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ని ర్వహణపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రి య సజావుగా సాగేలా ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్ర కారం ప్రతీ కేంద్రంలో ఓటింగ్ కంపార్ట్‌మెంట్ ఏ ర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు పూర్తిగా బ్యాలె ట్ పద్ధతిలో జరుగుతాయని, బ్యాలెట్ బాక్సులపై ఏజెంట్ల సమక్షంలో సీలు వేయాలని సూచించారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, విధుల్లో పాల్గొనే సిబ్బంది ఫారమ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వారంలోగా మరోసారి శిక్షణ అందిస్తామని తెలిపారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, తహసీల్దార్లు రామ్మోహన్, రోహిత్, ప్రిసైడింగ్ అధికారులు, అదనపు ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం తనిఖీ
జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శాసన మండలి పోలింగ్ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు రాకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న బోధన గురించి ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ రోహిత్, ఉపాధ్యాయులు ఉన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment