మహిళా కార్మికులు, ఉద్యోగులకు భద్రత కల్పించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పనిస్థలాల్లో మహిళా కార్మి కులు, ఉద్యోగులకు భద్రత కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చాంద్‌పాషా డిమాండ్ చేశారు. అభయ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తిచేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి ఎదు ట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళా ఉద్యోగులు, కార్మికులపై లైంగిక హింస పెరిగిందన్నారు. నిందితులను కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు అండగా పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బ్రహ్మానందం, తిరుపతి, హెడ్ నర్సులు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment