అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
రెబ్బెన(ఆసిఫాబాద్): పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భా గంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్‌ను అడిగి తె లుసుకున్నారు. స్టేషన్‌లో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులతోపాటు రిసెప్ష న్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూం పరిసరాల ను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. పోలీస్‌శాఖ బాధ్యతాయుతమైన వ్యవస్థ అని, ప్రజ లకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించా రు. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. నిందితులకు శిక్షపడేలా భౌతిక సాక్ష్యాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. రహదారి వెంట డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. అనంతరం కోర్టు విధులు నిర్వర్తిస్తున్న ఎల్.ఉమేశ్వర్‌కు నగదు రివార్డు అందించి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, సీఐ బుద్దె స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment