ఘనంగా నరకాసుర దహనం
కాగజ్‌నగర్‌లో నరకాసుర దహనం
కాగజ్‌నగర్‌రూరల్: నరక చతుర్దశిని పురస్కరించుకుని పట్టణంలోని పొట్టిశ్రీరాములు చౌరస్తాలో బుధవారం నరకాసుర దహనం ఘనంగా నిర్వహించారు. త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్‌బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ నరకాసుర వధతో మనలోని దుష్టశక్తులను పారదోలాలన్నారు. అనంతరం నరకాసుర ప్రతిమ తయారు చేసిన దాసరి లక్ష్మణ్, పంకజ్ అసావాలను జీయర్‌స్వామి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్, వ్యాపారులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment