సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ పోరాటం
● ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని పోరాటాలు సాగిస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతితో ఈఆర్సీ చైర్మన్ విద్యుత్ బిల్లుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ అని చెబుతూనే.. మరోవైపు చార్జీలు పెంచేందుకు ప్రయత్నించిందని ఆరోపించా రు. ప్రజలపై రూ.18,500 కోట్ల భారాన్ని మో పకుండా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఒత్తిడి తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలు నెరవేర్చేవరకు పోరాడతామని స్పష్టం చే శారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకేగూటి పక్షులని, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను బీజేపీ ప్రశ్నించ డం లేదన్నారు. సమావేశంలో నాయకులు అలీ బిన్ అహ్మద్, బుర్స పోచయ్య, రవీందర్, భీమే శ్, బలరాం, లక్ష్మణ్, బాబురావు, అహ్మద్, నిసార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment