అప్రమత్తంగా ఉంటేనే సంబురం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉంటేనే సంబురం

Published Thu, Oct 31 2024 12:55 AM | Last Updated on Thu, Oct 31 2024 12:55 AM

అప్రమత్తంగా ఉంటేనే సంబురం

అప్రమత్తంగా ఉంటేనే సంబురం

● ఆదమరిస్తే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ● స్వీయ జాగ్రత్తలే రక్ష

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఇంటిళ్లిపాది ఆనందంగా జరుపుకొనే పండుగ దీపావళి.. జిల్లావ్యాప్తంగా ప్రజలు గురు, శుక్రవారాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. దీపాలు, విద్యుత్‌ వెలుగులతో ఇళ్లు, షాపులు అలంకరించుకుంటారు. టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు స్వీరక్షణ చర్యలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నారులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. టపాసుల మోత ప్రభావం మన చెవులపై పడుతుంది. శబ్ద తీవ్రత 90 డెసిబెల్స్‌ దాటితే రక్షణ చర్యలు తీసుకోవాలి.

● టపాసులు కాల్చే సమయంలో సింథటిక్‌ దుస్తులు కాకుండా బిగుతుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.

● సగం కాలిన టపాసులను ముట్టుకోకుండా ఆర్పివేయాలి.

● గుడిసెలు, మంటలు అంటుకునే వస్తువుల వద్ద టపాసులు కాల్చొద్దు.

● అనుభవం లేనివారు విద్యుత్‌ పనులు చేయొద్దు.

● చేతులతో దీపాలు, కొవ్వొత్తులు పట్టుకుని బాంబులు కాల్చడం ప్రమాదకరం.

విక్రయ కేంద్రాల్లో నిబంధనలివి..

● ఖాళీ స్థలాల్లో మాత్రమే టపాసుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒకేచోట 50కి మించి ఏర్పాటు చేయొద్దు.

● వాణిజ్య సముదాయాలు, నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి.

● అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు చేసుకోవాలి. 200 లీటర్లతో రెండు బకెట్ల నీళ్లు, ఇసుక అందుబాటులో ఉంచాలి.

● దుకాణాల మధ్య కనీసం రెండు నుంచి మూడు మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

● సిగరేట్‌, బీడీలు తాగకుండా సూచన బోర్డులు ఏర్పాటు చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement