అటవీ అధికారులను సస్పెండ్ చేయాలి
సిర్పూర్(టి): మండలంలోని బెంగాళీ క్యాంపు కాలనీకి చెందిన ఏడుగురు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, కళ్లకు గంతలు కట్టి చితక్కొట్టిన సిర్పూర్(టి) ఎఫ్‌ఆర్‌వో, రెబ్బెన ఎఫ్‌ఎస్‌వోలను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. బెంగాళీ క్యాంపు కాలనీలో బాధిత కుటుంబాలను బుధవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పంటలు రక్షించుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారన్నారు. ఈక్రమంలో అడవి పంది కేసులో రైతులును రిమాండ్‌కు తరలించడం అన్యాయమన్నారు. సంబంధిత అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోని పక్షంలో రేంజ్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
నాగమ్మ చెరువులో చేపపిల్లలు విడుదల
బస్టాండ్ సమీపంలోని నాగమ్మ చెరువులో బుధవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విడుదల చేశారు. సంక్షేమ ఫలాలను మత్స్యకారులు వినియోగించుకోవాలని సూచించారు. నాగమ్మ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, మత్స్యకార సంఘం మండల అధ్యక్షుడు పోశం, నాయకులు సత్యనారాయణ, నానయ్య, నేరెళ్ల అశోక్, ఎల్ములే అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే హరీశ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment