ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి
సిర్పూర్(టి)/చింతలమానెపల్లి: ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా నడుచుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. చింతలమానెపల్లి, సిర్పూర్(టి) పోలీస్‌స్టేషన్లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికతో తెలుసుకోవాలన్నారు. ప్రతీ గ్రామంపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీసుల విధివిధానాల గురించి సూచించే 5ఎస్ విధానం అమలు చేయాలన్నారు. బ్లూకోల్ట్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహిస్తూ.. శాంతి భద్రతలు, సీసీ కెమెరాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ రమేశ్, ఎస్సైలు కమలాకర్, నరేశ్ పాల్గొన్నారు.
‘మ్యాగజిన్’ను సందర్శించిన సీఐఎస్‌ఎఫ్ డీఐజీ
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి– 1 గని ఆవరణలో సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న మ్యాగజిన్ (ఎక్స్‌ప్లోసివ్ నిల్వ కేంద్రం)ను బుధవారం సీఐఎస్‌ఎఫ్ సౌత్ జోన్– 2 (హైదరాబాద్) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అపరాజిత సందర్శించారు. మ్యాగజిన్ పరిసరాలను ఏరియా జీఎం శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏరియాలో గనులు, శాంతిభద్రతలపై చర్చించారు. మ్యాగజిన్ వద్ద శాంతిభద్రతల బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వసతి సౌకర్యాలు పరిశీలించారు. మ్యాగజిన్ నమూనాను అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం మొక్కలు నాటారు. కై రిగూడ పీవో నరేందర్, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, డీజీఎం స్టోర్స్ శ్రీనివాస్‌రావు, సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment