బాలికల సంక్షేమానికి కృషి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: బాలికల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌తో కలిసి మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బా లికల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్య, ఆరోగ్యంపై దృష్టి సారిస్తామన్నారు. బాలికలు, మహిళలు విద్య, శాస్త్ర, సాంకేతిక రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడి రాణిస్తున్నారని, ఇటీవల సివిల్ ఫలితాల్లోనూ మహిళలే సత్తా చాటారని గుర్తు చేశారు. బాలికలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఏకాగ్రతతో కష్టపడి చదవాలని సూచించారు. జిల్లాలోని వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. 32 బాలికల ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో విద్యార్థినులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, జీసీడీవో శకుంతల, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ, సఖీ కేంద్రాల సిబ్బంది, జిల్లా మహిళా సాధికారత సంస్థ సిబ్బంది, కేజీబీవీల ఎస్‌వోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment