సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బుధవారం సైబర్ నేరాలపై కార్యాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. బ్యాంకు సిబ్బంది, లాటరీల పేరుతో వచ్చే సందేశాలు, కాల్స్‌కు స్పందించొద్దని సూచించారు. అనంతరం రెబ్బెన సీఐ బుద్దె స్వామి మాట్లాడుతూ ఇళ్లలో జరిగే చోరీల కంటే సైబర్ నేరాల ద్వారా ప్రజలు ఎక్కువ సొమ్ము పొగొట్టుకుంటున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన పలు ఘటనల గురించి వివరించారు. మొబైల్‌లో అనుమానిత లింక్‌లు ఓపెన్ చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ భీంరావు జాడే, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ తిరుపతి, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, ఎస్సై చంద్రశేఖర్, సీనియర్ పీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment