కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
సిర్పూర్(టి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర దక్కుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. తేమ విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే తాగునీరు, నీడ సౌకర్యంతోపాటు టార్పాలిన్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం మండలంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. వెంకట్రావ్పేట్, పో డ్సా అంతర్రాష్ట్ర రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. వారి వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment