కలెక్టరేట్‌ ఎదుట జీపీ కార్మికుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట జీపీ కార్మికుల ధర్నా

Published Thu, Nov 7 2024 12:26 AM | Last Updated on Thu, Nov 7 2024 12:26 AM

కలెక్టరేట్‌ ఎదుట జీపీ కార్మికుల ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట జీపీ కార్మికుల ధర్నా

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట బుధవారం జీ పీ కార్మికులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను క్రమబద్ధీకరించాలని డి మాండ్‌ చేశారు. జీవో నంబర్‌ 51 సవరించి మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, విధి నిర్వహణలో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. జీపీ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వ్‌ర్‌ శ్రీకాంత్‌, కార్యదర్శులు గంగారాం, నగేశ్‌, రమేశ్‌, నాయకులు పుష్పలత, అనిల్‌, వసంత్‌, శంకర్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement