విద్యార్థినులు అధైర్యపడొద్దు
● డీసీపీవో మహేశ్
వాంకిడి(ఆసిఫాబాద్): వసతిగృహ విద్యార్థులు అధైర్య పడకుండా ఎలాంటి సమస్యలున్నా చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.మహేశ్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు. వంటగది, పరిసరాలను పరిశీలించారు. నిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ ఆరో గ్యకరమైన వాతావరణంలో విద్యనందించాలని సూచించారు. ఇటీవల జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని భోజనం, తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని, వంటగది పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినులు, సిబ్బందితో వేర్వేరుగా మా ట్లాడి బాలికలు అస్వస్థతకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శైలజ ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఆహారం, బోధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. సమాచారం ఇచ్చిన విద్యార్థినుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట సోషల్ వర్కర్ డోంగ్రి ప్రవీణ్ కుమార్, సూపర్‌వైజర్ పితాంబర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment