కై రిగూడ ఓసీపీ సందర్శన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి మంగళవారం పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌తో కలిసి కై రిగూడ ఓసీపీ ని సందర్శించారు. ఏరియాలో కొనసాగుతున్న బొ గ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, సివిల్ పనులపై సమీక్షించారు. కై రిగూడ ఓసీపీ క్వారీ లోపలికి వెళ్లి పని స్థలా లతోపాటు క్వారీలో బొగ్గు, ఓబీ వెలికితీత పనులను పరిశీలించారు. వెస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఓసీపీ పనిస్థలాలు వీక్షించారు. ఓసీపీ నుంచి డోర్లి 1కు వెళ్లే డైవర్షన్ రోడ్డు, వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు, సాధనపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పీవో నరేందర్, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, ఏరియా సర్వే అధికారి చంద్రశేఖర్, ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్న, సివిల్ ఎస్ఈ బాషా, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment