జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ ఏర్పడి పది నెలలవుతున్నా కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. కలెక్టర్, కమిషనర్‌కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి మున్సిపల్ కార్మికులకు బెనిఫిట్స్ అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మెకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు మాట్ల రాజు, కార్యదర్శులు సమ్మయ్య, వినోద్, నాయకులు దుర్గాప్రసాద్, నగేష్, శ్రీనివాస్, శంకర్, అశోక్, సాగర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment