కౌలు రైతులను గుర్తించాలని వినతి
ఆసిఫాబాద్: కౌలు రైతులను గుర్తించి ఎల్ఈసీ కార్డులు జారీ చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న గురువారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు పంట అమ్ముకునేలా రైతు భరోసా కార్డులు జారీ చేయాలన్నారు. ఈ విషయమై అసెంబ్లీ శీతాకాల సమావేశంలో లేవనెత్తాలని ఎమ్మెల్యేను కోరారు. జిల్లాలో 1.17 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా నిధులిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు మాణిక్రావు, దుందేరావు, యశ్వంత్, మహేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment