అమ్ముతున్నారు
‘మేడి పండు చూడు మేలిమై ఉండు..పొట్ట విప్పి చూడు పురుగులుండు..’ వేమన శతకంలోని ఈ రెండు వాక్యాలు వాంకిడి మండల కేంద్రంలోని బేకరీలకు సరిగ్గా సరిపోతాయి. రకరకాల ఆహార పదార్థాలతో, ఆకర్షణీయ ప్యాకింగులతో బేకరీలను అందంగా తీర్చి దిద్దుతూ పగలు సైతం వెలుగులు విరజిమ్మే లైటింగులతో ఎంతో సుందరంగా కనిపించే స్వీట్ హౌజ్‌లను కొంచెం లోతుగా పరిశీలిస్తే వామ్మో అనిపించడం ఖాయం. ఎంత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయో అందులో విక్రయించే తినుబండరాల తయారీ ప్రదేశం అంతే వికారంగా దర్శనమిస్తుంది. బేకరీల్లో విక్రయించే ఆహార పదార్థాల తయారీ వంటశాలలను శనివారం ‘సాక్షి’ పరిశీలించగా విస్తుపోయే పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న బేకరీలపై కథనం.
అనారోగ్యం
విద్యార్థుల అస్వస్థతకు ఇదీ కారణమేనా?
వాంకిడిలోని ఓ బేకరీలో అందంగా అమర్చిన ఆహార పదార్థాలు
డాంబర్‌ను తలపించే వంటనూనె..
బేకరీ నిర్వాహకులు ఆహార పదార్థాల త యారీలో వాడుతున్న వంటనూనెను అన్ని రకాల వంటలకు ఒకే కడాయిలో వాడుతున్నారు. మిగిలిన నూనెను పడేయకుండా మళ్లీమళ్లీ వాడుతున్నట్లు తెలుస్తోంది. నూనె చల్లారాక చూస్తే అచ్చం తారు రోడ్డు కు వాడే డాంబర్‌లా, కాలిపోయిన ఆయిల్ ఇంజన్‌లా కనిపిస్తోంది. అంతేకాకుండా కడాయిలోని నూనైపె ఎలాంటి కప్పు వేయకుండానే ఉంచుతున్నారు. దీంతో ఈగలు, ఇతర కీటకాలు పడే అవకాశం ఉంది. జిలేబి తయారీకి వాడే చక్కెర పాకం సైతం ఇష్టారీతిన అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచుతున్నారు. పాకం మిగిలి తే మరుసటి రోజున కూడా వాడుతున్నట్లు సమాచారం. ఒకసారి వేడి చేసిన నూననె మళ్లీ వేడిచేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు పేర్కొంటుండగా బేకరీల్లో మాత్రం దానికి విరుద్ధంగా వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆహార పదార్థాలలో నాసిరకం రంగులు వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెట్టు మాటున ఉన్న పుట్ట గురించి ఎరుగని అమాయక ప్రజలు లొట్టలేసుకుని బేకరీ ఫుడ్ ఆరగిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న బేకరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కల్తీ ఆహారం విక్రయించడాన్ని సహించకూడదు. అధికారులు తనిఖీలు నిర్వహించి అలాంటి బేకరీలను సీజ్ చేయాలి.
– దుర్గం దిన్‌కర్,
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కాలంచెల్లిన కూల్‌డ్రింక్స్..
మండల కేంద్రంలోని బేకరీలలో కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్, బూజు పట్టిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. గతనెల ఓ కూల్‌డ్రింక్ కొనుగోలు చేస్తే కాలం చెల్లింది ఇచ్చారు. తినుబండారాలు కొన్ని రోజులైనా పడేయకుండా ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి అమాయకులకు అంటగడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
– ఎలగతి సుచిత్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు
● నిబంధనలు పాటించని బేకరీ నిర్వాహకులు
● కాలం చెల్లిన పదార్థాలు విక్రయం
● అపరిశుభ్ర ప్రాంతాల్లో వంటకాలు
● ఆశ్రమ విద్యార్థినుల అస్వస్థతకు బేకరీ పదార్థాలపై అనుమానాలు
● ‘మామూలు’గా తీసుకుంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు
వాంకిడి: మూడేళ్ల క్రితం వరకు మండల కేంద్రంలో రెండు బేకరీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య ఐదుకు చేరింది. అద్దె ఎక్కువ ఉన్నా సరే ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలను ఎంచుకుని బేకరీలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ నిర్వాహకుల తీరు ప్రజల ఆరోగ్యానికి హానీ తలపెట్టేలా ఉంటోంది. ప్రజలు, పాఠశాలల విద్యార్థులు సైతం బేకరీ ఫుడ్‌పై ఆసక్తి కనబరుస్తుండటంతో దీనిని అవకాశంగా తీసుకున్న నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం రూ.లక్షల్లో విక్రయాలు సాగిస్తుండగా బూజు పట్టిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన పానియాలు విక్రయించినట్లు పలువురు వినయోగదారులు పేర్కొంటున్నారు. తనిఖీలు నిర్వహించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వంటగదులు అధ్వానం..
ఆహార పదార్థాల తయారీ సమయంలో శుచి, శుభ్రతకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వంట మాస్టర్లు, సరుకులు అందించే వ్యక్తులు వంటగదిలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కాల్చేందుకు సిద్ధంగా ఉంచిన సమోసాలు, పిండి వంటల తయారీకి సిద్ధం చేసిన పదార్థాల వద్దనే చెప్పులు వదిలేయడం, వాటి పైనుంచే తిరగడం వంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా పిల్లులు, కుక్కలు కూడా సంచరిస్తూ మూతలు కప్పకుండా ఉంచిన నూనె, జిలేబి పా కం, తదితర పదార్థాలను ఎంగిలి చేస్తున్నాయి. బేకరీలో రెడీమేడ్‌గా విక్రయించే కూల్‌డ్రింక్స్, ఇతర పదార్థాలు పలు సందర్భాలో కాలం చెల్లినవిగా, బూజు పట్టి ఉన్నట్లు పలువురు ఆరోపించారు. తాగునీటి కోసం కూలింగ్ ఫ్రిజ్‌లను వాడుతున్నా.. అందులో బోరు నీళ్లనే నింపుతున్నారు. ఫిల్టర్ నీళ్లు ఉంచాల్సి ఉండగా అడిగేవారు లేక జనరల్ నీటినే అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరైనా నిలదీస్తే వాటర్ బాటిల్ ఇచ్చి సాగనంపుతున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు పట్టింపు లేకుండా ఉండడంతో బేకరీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గత నెల వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాత్రి భోజనం వికటించి అస్వస్థతకు గురై ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేయగా బయటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినడం వల్లే అనారోగ్యం బారిన పడి ఉంటారని పాఠశాల సిబ్బంది మొదట్లో అనుమానం వ్యక్తం చేశారు. బేకరీలలోని ఆహార పదార్థాల తయారీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే విద్యార్థినుల అస్వస్థతకు ఇది కూడా ఒక కారణమే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలుషిత వాతావరణంలో తయారు చేస్తున్న పదార్థాలను ఎక్కువగా పాఠశాలలకు వచ్చే విద్యార్థులే కొనుగోలు చేసి తింటుంటారు. మధ్యాహ్న భోజనం సమయంలో, ఇంటికి వెళ్లే సమయంలో బేకరీలు విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులతో పాటు మండల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా కొనసాగుతున్న బేకరీల నిర్వాహణపై వివరణ కోరేందుకు ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తేజశ్వినికి పలుమార్లు ఫోన్ చేయగా స్పందించ లేదు.
Comments
Please login to add a commentAdd a comment