వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

Published Sun, Nov 24 2024 5:51 PM | Last Updated on Sun, Nov 24 2024 5:51 PM

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

లింగాపూర్‌: మండల కేంద్రంతో పాటు మామిడిపల్లి, కీమానాయక్‌తండా, జాముల్‌ధరా, చోర్‌పల్లి, పిక్లాతండా, కొత్తపల్లి, కంచన్‌పల్లితో పాటు వివిధ గ్రామాల్లో శనివారం అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జోడెన్‌ఘాట్‌ రేంజర్‌ జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడేందు కు పంటచేలకు విద్యుత్‌ తీగలు అమరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంత రం మండల కేంద్రంలోని గాంధీచౌక్‌ పరిఽధి లో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, ఎఫ్‌ఎస్‌వో భగవంత్‌రావు, ఎఫ్‌బీవో మహేశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement