విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల చదువుతో పా టు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని డీటీడీవో రమాదేవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, వంటగదులను శుభ్రంగా ఉంచుకోవాలన్నా రు. జీసీసీ నుంచి వచ్చే సరుకులు నాణ్యతగా ఉంటేనే తీసుకోవాలన్నారు. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. సిలబస్ పూర్తిచేసి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జీసీడీవో శకుంతల, సీఎంవో ఉద్దవ్, డీఎస్వో మీనా రెడ్డి, ఏటీడీవోలు చిరంజీవి, శ్రీనివాస్, ఖమర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment