‘మాలల సింహగర్జన’ విజయవంతం చేయాలి
రెబ్బెన: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో డిసెంబర్ 1న నిర్వహించ తలపెట్టిన మాలల సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని మాల మహానాడు మంచిర్యాల, కుమురంభీం జిల్లాల కన్వీనర్ తొగరి సుధాక ర్ పిలుపునిచ్చారు. శనివారం గోలేటిలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఒకే సామాజిక వర్గంలో ని ప్రజలను వర్గీకరణ పేరుతో విడగొట్టేందు కు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఎస్సీ వర్గీ కరణకు వ్యతిరేకంగా మాల ఉద్యోగులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, మహిళలు పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించాలన్నారు. కోకన్వీనర్ వెంకటరమణ, మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్, మాజీ ఎంపీటీసీ సురేందర్‌రాజు, నాయకులు యశో ద, అరుణ, మౌనిక, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment