ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా ప్రజలు మంగళవారం అర్ధరాత్రి నుంచే 2024కు వీడ్కోలు పలుకుతూ.. 2025కు ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. కేక్‌లు కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సెల్‌ఫోన్లు, సామాజిక మాద్యమాల ద్వారా స్నేహితులు, బంధువులకు సందేశాలు పంపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ షాపులు, స్వీట్ హౌస్‌లు కిటకిటలాడాయి. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కేక్‌లు విక్రయించారు. కిలో కేక్‌ను రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణించడంతో సంతాపదినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించరాదని సూచించగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు నిర్వహించలేదు. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులే వేడుకలు జరుపుకొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సంబురాలు
కిటకిటలాడిన కేక్ దుకాణాలు
Comments
Please login to add a commentAdd a comment