రెవెన్యూ గ్రామానికో వీఎల్‌వో!
● నియామకానికి రాష్ట్ర సర్కారు కసరత్తు ● పూర్వపు వీఆర్వోలకు మళ్లీ రెవెన్యూ శాఖలోకి ఆహ్వానం ● ఇప్పటికే పలువురు దరఖాస్తు ● జిల్లాలో 434 రెవెన్యూ గ్రామాలు
సాక్షి ఆసిఫాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెవెన్యూ గ్రా మానికి ఒక వీఎల్‌వో నియామకానికి కార్యాచరణ చేపట్టింది. గత ప్రభుత్వం వీఆర్వోలను ఇతర శా ఖలోకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బ దిలీ అయిన ఉద్యోగులు మున్సిపాలిటీ, డీఆర్డీవో, ఎంపీడీవో, డీఈవో, వ్యవసాయశాఖలతో పాటు ఇతర శాఖల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా భూభారతి చట్టాన్ని పటిష్టం చేయడానికి ముమ్మరంగా యత్నిస్తున్న ప్రభుత్వం గ్రామస్థాయి అధికారులను(వీఎల్‌వో) నియమించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో వీఆర్వోలు, వీఆర్‌ఏ లుగా పనిచేసిన వారందరినీ తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. తొలుత వీఆర్వోలను విధుల్లోకి తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తి గల వీఆర్వోలు తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలి ఆదేశించింది.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ వీఆర్వోలు, వీఆర్‌ఏలు విధులు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో రెవెన్యూ వ్యవస్థ బలోపే తం చేసేందుకు గ్రామస్థాయి అధికారి(వీఎల్‌వో)ను నియామకం కానున్నారు. ఆసక్తి ఉన్న వీఆర్వోల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 74 మంది వీఆర్వోలు, 139 మంది వీఆర్‌ఏలు తిరిగి రెవెన్యూ వ్యవస్ధలోకి వచ్చేందుకు సుముఖం వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
డిగ్రీ అర్హతగా నిర్ణయం
కొత్తగా రెవెన్యూ వ్యవస్థలోకి రానున్న ఉద్యోగులకు డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 74 మంది వీఆర్వోల్లో 33 మందికి డిగ్రీ, ఆపై అర్హత ఉంది. అలాగే వీఆర్‌ఏల్లో 40 మంది ఉద్యోగులకు డిగ్రీ, ఆపై అర్హత ఉంది. మిగిలిన వారు ఇంటర్ అంతకన్నా తక్కువ చదువుకున్న వారు ఉన్నారు. అయితే జిల్లాలో 434 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రభుత్వం నిర్ణయించిన విద్యార్హత కలిగిన వారు కేవలం 73 మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన స్థానాలను ఏ విధంగా భర్తీ చేయనున్నారన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment