రాష్ట్రంలోనే అత్యల్పం
తిర్యాణి(ఆసిఫాబాద్): బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో దాదాపు పదిరోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ప్రతిరోజూ సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పైనే ఉన్నాయి. న్యూఇయర్ వేడుకల సమయంలోనూ చలి అంతగా లేదు. మళ్లీ రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదువుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు గజ గజ వణుకుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. చలి గాలులకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
జిల్లాలో రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే ఉంటున్నాయి. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ మండలాల్లో చలి మరింత వణికిస్తోంది. గురువారం సిర్పూర్(యూ)లో 7.3, తిర్యాణి మండలం గిన్నెధరిలో 8.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన విష యం తెలిసిందే. శుక్రవారం చలి మరింత పెరిగి గిన్నెధరిలో, సిర్పూర్(యూ)లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. అలాగే తిర్యాణి మండల కేంద్రంలో 7.9, కెరమెరిలో 9.3, కెరమెరి మండలం ధనోరాలో 9.8, వాంకిడిలో 10.4, కాగజ్‌నగర్‌లో 10.5, జంబు గాలో 10.6, రెబ్బెనలో 11.0, చింతలమానెపల్లిలో 11.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగితే రెండేళ్ల క్రితం జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదైన 4.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల కంటే అత్యల్పంగా రికార్డయ్యే అవకాశం ఉంది. వాతా వరణ మార్పులతో చిన్నారుల్లో జలుబు, న్యూ మోనియా, వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంటుందని, అత్యవసరమైతే తప్పా వృద్ధులు, చిన్నారులు చలిలో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అస్తమా, ఎలర్జీలు ఉ న్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
వణుకుతూనే పనికి..
మాకు సింగరేణి ఓపెన్ కా స్టులో మొదటి షిఫ్ట్ డ్యూటీ నాలుగు గంటలకే ప్రారంభమవుతుంది. మా గ్రామం నుంచి పని ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. రాత్రి 2.30 గంటలకే నిద్రలేచి పని తయారు కావాలి. మూడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతాం. ఉన్ని దుస్తులు వేసుకున్న చలిలో వణుకుతూనే పనికి వెళ్తున్నాం.
– తిరుపతి, కార్మికుడు, గ్రామం.సుంగాపూర్
రెండు రోజులుగా మళ్లీ చలితీవ్రత
గజ గజ వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు
గిన్నెధరి, సిర్పూర్(యూ)లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
Comments
Please login to add a commentAdd a comment