● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స్‌ ● పెట్రోల్‌ బంకుల్లో పేరుకుపోయిన బకాయిలు ● జిల్లావ్యాప్తంగా ప్రతినెలా రూ.10 లక్షలకు పైగా ఖర్చు ● బిల్లులు రాకపోవడంతో సొంతంగా వెచ్చిస్తున్న పోలీసులు ● నిధుల విడుదలకు ఆర్థికశాఖ కార్యదర్శికి ఐజీ స్వయం | - | Sakshi
Sakshi News home page

● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స్‌ ● పెట్రోల్‌ బంకుల్లో పేరుకుపోయిన బకాయిలు ● జిల్లావ్యాప్తంగా ప్రతినెలా రూ.10 లక్షలకు పైగా ఖర్చు ● బిల్లులు రాకపోవడంతో సొంతంగా వెచ్చిస్తున్న పోలీసులు ● నిధుల విడుదలకు ఆర్థికశాఖ కార్యదర్శికి ఐజీ స్వయం

Published Sun, Jan 5 2025 1:05 AM | Last Updated on Sun, Jan 5 2025 1:05 AM

● పోల

● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లా గస్తీ పోలీసులను డీజిల్‌, పెట్రోల్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. గత పది నెలలుగా పోలీసు స్టేషన్లకు ఇచ్చే ఫ్యూయల్‌ ఫండ్స్‌ ఆర్థికశాఖ నుంచి విడుదల కాలేదు. పెట్రోలింగ్‌ వాహనాలు మూలకుపడే పరిస్థితి నెలకొంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పోలీసులకు సర్కారు ఇన్నోవా వాహనాలను అందించింది. గస్తీ నిర్వహించేందుకు ప్రతీ స్టేషన్‌కు రూరల్‌ ఏరియాలో ఒకటి, అర్బన్‌లో రెండు వాహనాలను కేటాయించింది. అయితే ప్రభుత్వం పెట్రో నిధులు విడుదల చేయకపోవడం.. పెట్రోల్‌ బంకుల యజమానులు అప్పుగా ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసుస్టేషన్‌ ఉన్నతాధికారులే ఇంధన ఖర్చులు భరిస్తున్నారు.

200లకు పైగా పోలీసు వాహనాలు

జిల్లాలో పెట్రోకార్లు 11 ఉండగా.. బ్లూకోల్ట్స్‌ బైక్‌లు 37 ఉన్నాయి. ఇవి కాకుండా ఆఫీసర్‌ కార్లు 20, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కార్లు 17 వరకు ఉన్నాయి. వీటితోపాటు బాంబు స్క్వాడ్‌, ఆర్‌వోబీ, వీఐపీ ఎస్కార్ట్‌, స్పెషల్‌ పార్టీ పోలీసు సిబ్బంది కోసం మరో 115 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పెట్రోకార్‌కు నెలకు 120 లీటర్లు, ఎస్సై స్థాయి అధికారి తిరిగే బొలెరో వాహనానికి 110 లీటర్లు, బ్లూకోల్ట్స్‌ బైక్‌లకు 25 లీటర్ల చొప్పున సర్కారు ఇంధనం అందిస్తోంది. ఇలా జిల్లాలో దాదాపుగా 200 పైగా వాహనాలకు ప్రతినెలా డీజిల్‌, పెట్రోల్‌ కోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతున్నట్లు సమాచారం.

ఇంధనం కొరత.. అరకొర గస్తీ

పోలీసుశాఖలో పెట్రోలింగ్‌, ఇతర అవసరాల కో సం వినియోగిస్తున్న వాహనాలకు జిల్లాలో తొమ్మి ది పెట్రోల్‌ బంకుల్లో బకాయి కింద డీజిల్‌, పెట్రోలు నింపుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసినప్పుడు ఆయా బంకుల యజమానులకు పోలీసు అధికారులు బిల్లులు చెల్లించేవారు. అ యితే 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 5 నెలలు, 2024– 25 ఆర్థిక సంవత్సరం మరో 5 నెలల ఇంధనం బిల్లులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేయలేదు. దీంతో పెట్రోల్‌ బంకుల్లో రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. గతంలో పోసిన డీజిల్‌ బిల్లులకు అతీగతి లేకపోవడంతో యజమానులు పోలీసు వాహనాలకు డీజిల్‌, పెట్రోల్‌ను అప్పుగా ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. జిల్లాలోని దాదాపు స్టేషన్‌ హౌస్‌ అధికారులు అందరూ పెట్రోల్‌ బంక్‌ యజమానులను బతిమిలాడి పెట్రోలింగ్‌ వాహనాల్లో ఇంధనం పోయించుకుంటున్నట్లు తెలిసింది. మరికొందరు అధికారులు డీజిల్‌, పెట్రోల్‌ కోసం ఇతరుల వద్ద అప్పు చేయడం లేదా చేతి నుంచి ఖర్చు పెట్టుకోవడం ద్వారా కొన్నాళ్లు నెట్టుకురాగా... ప్రస్తుతం వారు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో గల్లీల్లో గస్తీ బండే కనిపించడం లేదు. రాత్రిపూట అరకొరగా గస్తీ కాస్తున్నా పగటి పూట ఆ సంగతే మరిచారు.

రూ.కోటికి పైగా బకాయిలు

జిల్లావ్యాప్తంగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలకు కోసం వినియోగించిన ఇంధనం బిల్లులు రూ.కోటికి పైగా బకాయి ఉన్నట్లు సమాచారం. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని మల్టీజోన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత 10 నెలలు డీజిల్‌ బిల్లులు రాకపోవడంపై స్వయంగా ఐజీ స్థాయి అధికారి ఒకరు ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు సమా చారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డీజిల్‌ బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించిన బిల్లులను మాత్రమే విడుదల చేయకపోవడంపై పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు చేస్తోన్న జాప్యం వల్ల జిల్లాలో గస్తీ పెట్రోలింగ్‌ మూలన పడుతుందన్న వాదన వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స1
1/2

● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స

● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స2
2/2

● పోలీసు వాహనాలకు 10 నెలలుగా విడుదల కాని ఫ్యూయల్‌ ఫండ్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement