ఆసిఫాబాద్: జిల్లాలోని మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని షీటీంలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధి కారులు డిసెంబర్‌లో 20 ప్రాంతాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. 54 హాట్‌స్పాట్‌లు గుర్తించి షీటీంలు 92 సార్లు సందర్శించాయని పేర్కొన్నారు. హాట్‌స్పాట్‌ల వద్ద నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. భరోసా కేంద్రంలో ఇప్పటివరకు 22 కేసులు నమోదు కాగా, ముగ్గురికి నష్టపరిహారం వచ్చిందని తెలిపారు. భరోసా కేంద్రం ద్వారా 12 పాఠశాలల్లోని బాలబాలికలకు అవగాహన కల్పించామన్నారు. 17 మంది బా ధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యం, ఆర్థిక పరి స్థితి తెలుసుకున్నామని పేర్కొన్నారు. బాధితులు డయల్ 100, షీటీం వాట్సాప్ నంబర్లు 87126 70564, 87126 70575కు ఫోన్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment