జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి రవి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై న ట్లు ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. పాఠశాల ఆవరణ శనివారం పీడీ శంకర్‌తో కలిసి విద్యార్థిని అభినందించారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన రవి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. ఈ నెల 5 నుంచి 9 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. అధ్యాపకులు సంతోష్, రహీం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment