‘యువతకు బాసటగా సింగరేణి’
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తే కాకుండా సమీప గ్రామాల అభివృద్ధితో పాటు విద్యార్థులు, యువతకు బాసటగా నిలుస్తోందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని మంగళవా రం సందర్శించారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువకులతో మాట్లాడారు. పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని రకాల పుస్తకాలను సమకూర్చామన్నారు. సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ కొలువుల సాధననే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సింగరేణి పాఠశాలలో గదుల మరమ్మతులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని సివిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment