జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
రెబ్బెన(ఆసిఫాబాద్): హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 14 వ రకు జరిగే జాతీయస్థాయి సీనియర్ సెపక్‌తక్రా పో టీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు సెపక్‌తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. 34వ సీనియర్స్ సెపక్‌తక్రా జా తీయ స్థాయి పోటీలకు పురుషుల విభాగంలో రెబ్బెన మండలం గోలేటికి చెందిన ఆర్.వెంకటేశ్, ఆడే రాజేందర్, పులిపాక రాజశేఖర్, మహిళా జ ట్టుకు కే.శ్రీస్ఫూర్తి కారుణ్య, ఆర్.విష్ణు ప్రియ ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులను ఉమ్మడి ఆదిలాబా ద్ ఒలింపిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.శిరీష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, మల్లేశ్, బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment