క్రీడలతో స్నేహభావం
ఆసిఫాబాద్‌రూరల్: క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో మంగళవారం పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ విద్యార్థులకు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రీడాపోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలన్నారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మెరుగైన ప్రతిభ చూపాలని సూచించారు. కాగా ఈ పోటీల్లో జిల్లాలోని ఆరు వసతి గృహాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, 200 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన 55 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌వో మీనారెడ్డి, కోచ్ విద్యాసాగర్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment