నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర
దహెగాం(సిర్పూర్): నాణ్యమైన వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంతోపాటు ఐనం, లగ్గాం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సంక్రాంతి పండుగ లోగా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధా న్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఆయన వెంట డీసీవో బిక్కునాయక్, డీటీ శ్రీనివా స్, ఏఈవో వంశీ, సీఈవో నారాయణ, సిబ్బంది జీవన్, నరసింహా తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయాలి
సిర్పూర్(టి): మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు రెండు రోజుల్లో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని దుబ్బగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం చేయొద్దన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏపీఎంలు దుర్గయ్య, శ్రీనివాస్, సీసీలు రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment