బాలికల విద్యకు సావిత్రిబాయి కృషి
ఆసిఫాబాద్‌అర్బన్: దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సావిత్రిబాయి పూలే బాలికల విద్యకు ఎనలేని కృషి చేశారని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవా రం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవి, విద్యాశాఖ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ ది నోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. 18వ శతాబ్దంలో ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే ఆటంకాలు, అవాంతరాలు ఎదుర్కొని పాఠశాలలు ఏర్పాటు చేసి సావిత్రిబాయి బాలికలకు విద్యనందించేందుకు కృషి చేశారని తెలిపారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 50 శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సహాయ సంచాలకుడు గమ్మానియల్, ప్రధానోపాధ్యాయుడు ఉదయ్ బాబు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతి
ఆసిఫాబాద్‌రూరల్: తిర్యాణి మండలంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం పీడీఎస్‌యూ నాయకులు జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ తిర్యాణి మండలం నాయకపుగూడలోని గురుకుల పాఠశాలలో 537 మంది బాలకలు చదువుతున్నారని తెలిపారు. నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని కోరారు. నాయకులు లెనిన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment