ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 23,25,517 | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 23,25,517

Published Tue, Jan 7 2025 12:17 AM | Last Updated on Tue, Jan 7 2025 12:17 AM

-

● పురుషులతో పోల్చితే మహిళలే అధికం ● నియోజకవర్గాల వారీగా టాప్‌లో మంచిర్యాల.. చివరన బెల్లంపల్లి ● తుది జాబితా ప్రకటించిన అధికారులు

కైలాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2025లో భాగంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని ఓటర్ల తుది జాబితాను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు(కలెక్టర్లు) సోమవారం ప్ర కటించారు. ఈ ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 23,25, 517 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 11,37,514 మంది, మహిళలు 11,87,865 మంది, ఇతరులు 138 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్ల సంఖ్యనే ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉంది. 50,351 మంది మహిళా ఓటర్లు అ ధికంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరి శీలిస్తే మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లుండగా బెల్లంపల్లిలో అత్యల్ప ఓటర్లు ఉన్నారు.

నిర్మల్‌ నియోజకవర్గంలో అతివలే అధికం..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పురుష ఓటర్లతో పో ల్చితే మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల భవితవ్యాన్ని అతివలే నిర్ణయించనున్నారు. మహిళా ఓట ర్లు నిర్మల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 14,642 మంది ఉండగా అత్యల్పంగా సిర్పూర్‌లో 488 మంది ఉన్నారు. ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ముధోల్‌లో 7,850, చెన్నూర్‌లో 2,085, బెల్లంపల్లిలో 2,127, మంచిర్యాలలో 3,115, ఆసిఫాబాద్‌లో 1,998, ఖానాపూర్‌లో 5,392 , ఆదిలాబాద్‌లో 5,755 మంది ఉండగా బోథ్‌లో 6,899 మంది మహిళా ఓట ర్లు అధికంగా ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించిన జాబితా స్పష్టం చేస్తోంది.

అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో...

అధికారులు ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ను నాలుగు జిల్లాల కలెక్టరేట్లు, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలతో పాటు బీఎల్‌వోల వద్ద కూడా ఓటర్ల తుది జాబితాను అందుబాటులో ఉంచనున్నారు.

నియోజకవర్గం పోలింగ్‌ పురుష మహిళా ఇతరులు మొత్తం కేంద్రాలు ఓటర్లు ఓటర్లు

సిర్పూర్‌ 320 1,15,323 1,15,811 16 2,31,150

చెన్నూర్‌ 230 96,964 99,049 07 1,96,020

బెల్లంపల్లి 227 88,109 90,286 13 1,78,408

మంచిర్యాల 290 1,39,306 1,42,421 26 2,81,753

ఆసిఫాబాద్‌ 358 1,13,815 1,15,813 16 2,29,644

ఖానాపూర్‌ 308 1,11,157 1,16,549 14 2,27,720

ఆదిలాబాద్‌ 292 1,21,050 1,26,805 06 2,47,861

బోథ్‌ 303 1,03,554 1,10,453 02 2,14,009

నిర్మల్‌ 306 1,23,088 1,37,730 21 2,60,839

ముధోల్‌ 311 1,25,148 1,32,948 17 2,58,113

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓటర్ల వివరాలు

కొత్తగా 21వేల ఓటర్లు నమోదు

ఉమ్మడి జిల్లాలో కొత్తగా 21,902 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది అక్టోబర్‌ 29న ప్రకటించిన ముసాయిదా జాబితా నుంచి సోమవారం ప్రకటించిన తుది జాబితా వరకు ఈ సంఖ్య నమోదైంది. నాలుగు జిల్లాల పరిధిలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన 6,575 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 1475 మంది ఓటర్లను తొలగించగా, కొ త్తగా 4,984 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. మంచిర్యాలలో 2,282 మంది ఓటర్లను తొలగించగా, 5,216 మందిని ఓటర్లుగా కొత్తగా చేర్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 1898 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించగా, 5,430 మందిని కొత్తగా చేర్చారు. నిర్మల్‌ జిల్లాలో 920 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించగా, కొత్తగా 6,272 మంది ఓటు హక్కు పొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement