వేతనాలు విడుదల చేయాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారికి పది నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షు డు రాజేందర్ మాట్లాడుతూ వేతనాల కోసం పలుమార్లు విన్నవించినా ఒకనెల వేతనం కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, కృష్ణవేణి, సునీత, శ్రీదేవి, సుజాత, లలిత, మారుబాయి ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్యకళాశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. 15 ల్యాబ్ అటెండర్, 7 డాటా ఎంట్రీ ఆపరేటర్, 3 రేడియోగ్రాఫిక్, 3 సిటిస్కాన్ టెక్నీషియన్, 2 ఈసీజీ టెక్నీషియన్, 4 అనస్తీషియా టెక్నీషియన్, 4 ధోబీ/ఫ్యాకర్స్, 2 ఎలక్ట్రీషియన్స్, 1 ప్లంబర్, 1 డ్రైవర్ (భారీ వాహనం), 4 థియేటర్ అసిస్టెంట్, 2 గ్యాస్ ఆపరేటర్, 4 వార్డ్‌బాయ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 7 నుంచి 17 వరకు ప్ర భుత్వ వైద్యకళాశాలలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం gmc kumurambheemasifabad.org, asi fabad.telangana.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment