‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలో ని బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. వంటశాలతోపాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన విద్యనందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు దృషి సారించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఆయన వెంట ఎస్‌వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ఉపాధ్యాయులు లక్ష్మణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment