రెండోరోజూ వైద్య విద్యార్థుల ఆందోళన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు రెండోరోజూ ఆందోళనలు కొనసాగించారు. మొదటిరోజు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించగా, శుక్రవారం తరగతులు బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) వాణి హైదరాబాద్ నుంచి కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థులను సమూదాయించి లోపలికి తీసుకెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. డీఎంఈ మాట్లాడుతూ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. విద్యార్థినులకు పాత కలెక్టరేట్ భవనంలో ఒకేచోట వసతి కల్పిస్తామని, బాలురకు నిర్మాణం ఉన్న భవనం త్వరగా పూర్తిచేసి అందులో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల మెడికల్ కాలేజీల నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను సర్దుబాటు చేసి సోమవారం లోగా పంపిస్తామని హామీ ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణ కోసం తక్షణమే 20 మందిని నియమిస్తామన్నారు. డీఎంఈ హామీలతో విద్యార్థులు ఆందోళనలను తాత్కాలికంగా విరమించారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
● సమస్యల పరిష్కారానికి డీఎంవో హామీ
Comments
Please login to add a commentAdd a comment