11న హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి
ఆసిఫాబాద్‌అర్బన్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఈ నెల 11న ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవా రం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, కమిటీ ప్రతినిధులతో కలిసి వర్ధంతి ఆహ్వాన పత్రిక, కరపత్రాలు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి హైమన్ డార్ఫ్ దంపతులు వర్ధంతి విజయవంతం చేయాలన్నారు. అడవి బిడ్డల జీవన స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైమన్ డార్ఫ్ దంపతులు తమ జీవితాన్ని ధారపోశారని తెలిపారు. ఆదివాసీల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయులని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment