‘స్థానిక’ంపై ఫోకస్
● ఆదిలాబాద్ నుంచే కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం ● నేడు పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేఽశం ● హాజరుకానున్న పీసీసీ చీ్‌ఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్‌ను సన్నద్ధం చేసే దిశగా దృష్టి సారించింది. ఎన్నికల్లో విజయానికి ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హస్తం పార్టీ.. ‘స్థానిక’ సమరానికి సైతం జిల్లా నుంచే సమర శంఖం పూరించాలని సంకల్పించింది. ఈ మేరకు సోమవారం ఆది లాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష ని ర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌ డ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ ము న్షి అతిథులుగా హాజరై ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో రాజకీయంగా ఎన్నికల వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది.
సెంటిమెంట్ ఆనవాయితీగా..
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూ పం వేదికగా దళిత, గిరిజన దండోరా పేరిట ఎ న్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయ ఢంకా మోగించి అధికారం చేపట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా రేవంత్ రెడ్డి ఇదే ఆనవాయితీ కొనసాగించారు. తొలుత ఇంద్రవెల్లిలోనే పర్యటించారు. తాజాగా స్థానిక సంస్థల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెలా ఖరు లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఆ తర్వాత మండల, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఈ ఎన్నికల న్నింటిలోనూ సత్తా చాటాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకు కేడర్‌ను పూర్తిస్థాయిలో సంసిద్ధులను చేసే దిశగా కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షలను నిర్వహించాలని భావించిన హైకమాండ్ ఆదిలాబాద్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం.
కేడర్‌లో జోష్ నింపేలా...
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. అయితే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పూర్తిస్థాయి అమలుపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించి సర్కారును ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో పార్టీ కేడర్‌లోనూ జోష్ తగ్గి కాస్త నిరుత్సాహం ఆవరించింది. పైగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తమ సమస్యలను ఆలకించేవారు లేరనే ఆవేదన కేడర్‌లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న శ్రేణులో జోష్ నింపి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు త్వరలో అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎన్నికలకు సంసిద్ధులను చేసేలా పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మావల మండల కేంద్రంలోని పద్మనాయక గార్డెన్‌లో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించనున్న సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థలతో పాటు త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎలాంటి కార్యాచరణ అనుసరించాలి.. గెలుపు కోసం ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై సదరు నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తొలి సమావేశం, పైగా ఎన్నికలకు సంబంధించినది కావడంతో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ లు దీన్ని సవాలుగా తీసుకుని పెద్ద ఎత్తున కేడర్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసమీకరణ ద్వారా తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment