భరోసా కేంద్రాన్ని సందర్శించిన జడ్జి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యువరాజు ఆదివారం సందర్శించారు. కేంద్రంలో పనిచేసే ఉద్యోగుల విధులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. న్యాయమూర్తిని సిబ్బంది శాలువాతో సన్మానించారు. అంతకు ముందు కోర్టు హాల్‌లో బాలల పరిరక్షణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీసీటీవో మహేశ్, భరోసా ఉమెన్ ఎస్సై తిరుమల, లీగల్ అడ్వయిజర్ శైలజ, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, రిసెప్షనిస్టు సుమలత, న్యాయవాది వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment