నేడు కార్మికులతో ఎమ్మెల్సీ కవిత సదస్సు
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి టౌన్‌షిప్‌లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులతో సదస్సు నిర్వహిస్తారని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కేసీఆర్ నాయకత్వంలో అందించిన సంక్షేమ పథకాల అమలు, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, గుర్తింపు సంఘం హామీల అమలు, ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఏరియాలోని కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అజ్మీర బాబురావు, నాయకులు దయాకర్, కిష్టయ్య, మల్లయ్య, వెంకటేశ్, సమ్మయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment