మెనూ ప్రకారం భోజనం అందించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండలంలోని బంబార ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంట గది, పాఠశాల రికార్డులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారమే భోజనాలు అందించాలన్నారు. హాస్టల్ పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment