గిరిజన శాఖ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం
ఆసిఫాబాద్‌అర్బన్: గిరిజన శాఖలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీఎంహెచ్ బాలికల పాఠశాలలో గురువారం రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్, ప్రధాన కార్యదర్శి వాలుసింహ, కోశాధికారి జైతు, ఎన్నికల అధికారి ఏసీఎంవో ఉద్దవ్ సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా రాంచందర్, ఉపాధ్యక్షులుగా కోటయ్య, రవి, ప్రధాన కార్యదర్శిగా పోచం, సహాయ కార్యదర్శులుగా ఓంకార్, కై లాస్, జిల్లా ఆఫీస్ కార్యదర్శులుగా మహేశ్, వసంత్, ప్రచార కార్యదర్శులుగా ఉపేందర్, చిరంజీవి, కోశాధికారిగా చంద్రమోహన్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రేణుకాబాయి, శంకర్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా వనిత, సంగీత, శివప్రసాద్, రమేశ్, తెలంగ్‌రావు, చంద్రయ్య, చంద్రకాంత్, బాపు, మౌనిక, రమణ, సీతారాం, వినోద్, వెంకటేశ్, సురేందర్, నాందేవ్, లలిత, రాధాబాయిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. నూతన జిల్లా కార్యవర్గం ఐదేళ్లు కొనసాగుతుందని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment