గాయకుడు ఇర్ఫాన్‌కు పురస్కారం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాకు చెందిన ఉద్యమ గాయకుడు ఇర్ఫాన్‌ను పురస్కారం వరించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆదర్శ కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సి ల్వర్ జుబ్లీ వేడుకల్లో భాగంగా ఆయా రంగాల వారికి నంది పురస్కారాలు ప్రకటించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కవి, గాయకుడు నేర్నాల కిషోర్, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపక సభ్యుడు నాగరాజు చేతుల మీదుగా ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఇర్ఫాన్‌కు నంది పురస్కారం ప్రదానం చేశారు. ఈ నెల 1న తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ వారి సౌజన్యంతో ఇండియన్ మోక్షిత సేవా సమితి కూడా ఇర్ఫాన్‌కు నంది అవార్డు ఇచ్చి గౌరవించింది. ఇర్ఫాన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటపాటలతో అలరించిన తనకు రెండు నంది అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment