నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామం వద్ద గల ఖందేవ్ పుణ్యక్షేత్రం సోమవారం ఆదివాసీలతో సందడిగా మారింది. మాసేమాల్ పేన్కు సంప్రదాయ ప్రకారం చేపట్టనున్న మహాపూజకు తొడసం వంశీయులు భారీగా తరలివచ్చారు. ఎండ్ల బండిపై కొందరు రాగా కాలినడకన పూజ సామగ్రితో మరికొందరు ఆలయానికి చేరుకున్నారు. రాత్రి మహాపూజ నిర్వహించారు. మంగళవారం ఉదయం 9గంటలకు ఖందేవుని సన్నిధిలో తొడసం ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ అని ఆలయ కమిటీ చైర్మన్ తొడసం నాగోరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment