ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా 2017 నుంచి పనిచేస్తున్న పశుమిత్రలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని పశుమిత్రల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచారి డిమాండ్ చేశా రు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పశుమిత్రలకు ప్రభుత్వం వేతనం నిర్ణయించకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.26వేలుగా చెల్లించాలని, గుర్తింపుకార్డులు, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఏడాదికి రెండు జతల యూనిఫాంలు, మెడికల్ కిట్లు, సరిపడా మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు వనిత, శ్రీలత, పుష్ప, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment